‘తిలక్‌కు బదులు సంజూనే ఆడించాలి’.. టీమిండియాపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలు

  • ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లో టీమిండియా వరుస పరాజయాలు
  • తిలక్‌ను ఎందుకు కాపాడుతున్నారంటూ శ్రీకాంత్ ప్రశ్న
  • అతడికి షార్ట్‌ పిచ్‌ బంతులు బలహీనత అని కూడా తెలుసని వ్యాఖ్య
  • తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరిక
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా వరుస పరాజయాలు చవిచూస్తుండటంతో జట్టుపై విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఆటతీరు నిరాశపరుస్తోందంటూ భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిలక్‌కు బదులుగా సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించారు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన శ్రీకాంత్.. ‘‘తిలక్ వర్మ పూర్తిగా అయోమయంలో ఉన్నాడు. అతని స్థానంలో నేను సంజూ శాంసన్‌కే అవకాశం ఇస్తాను. వైస్ కెప్టెన్‌గా నియమించిన ఆటగాణ్ని ఎందుకు కాపాడుతున్నారు?’’ అని ప్రశ్నించారు. తిలక్‌కు షార్ట్ పిచ్ బంతులు బలహీనత అని తెలిసే అక్షర్ పటేల్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపుతున్నారని, జట్టు యాజమాన్యం తప్పుడు సంకేతాలు ఇస్తోందని విమర్శించారు.

వైస్ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత తిలక్ వర్మ 19, 55, 13, 24 నాటౌట్, 3 పరుగులు మాత్రమే చేశాడు. ఐర్లాండ్‌పై చేసిన 55 పరుగుల ఇన్నింగ్స్ మినహా అతడు ప్రభావం చూపలేకపోయాడు. ఇంగ్లండ్ పర్యటనలోనూ బ్యాటింగ్ విభాగం వరుసగా విఫలమవుతుండటంతో జట్టు ఎంపిక, నాయకత్వ నిర్ణయాలపై విమర్శలు మరింత పెరుగుతున్నాయి.

Tilak Varma
Sanju Samson
Krishnamachari Srikkanth
India vs England T20
Team India selection
Indian cricket team news

More Telugu News